ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని ఫైల్ చేసేవారికి గుడ్ న్యూస్. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చివరి తేదీని సెంట్రల్ డైరెక్ట్ టాక్సెస్ బోర్డు(సీబీడీటీ) మరోసారి పొడిగించే అవకాశం వుంది అని నిపుణులు అంటున్నారు. మామూలుగా అయితే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. అయితే ఈ సమయాన్ని ఎక్స్టెండ్ చెయ్యనున్నారు. ఎందుకు ఈ గడువుని ఎక్స్టెండ్ చేస్తున్నారంటే…
దీనికి ప్రధాన కారణంగా www.incometax.gov.in పోర్టల్‌లో టెక్నీకల్ సమస్యలు. సోషల్ మీడియా ద్వారా ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఈ విషయాన్నీ చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఈ ఫైలింగ్ పోర్టల్‌ను జూన్ 7న మొదలు పెట్టింది. ఐతే దీని ద్వారా సులువుగా, వేగంగా పన్ను చెల్లింపు చేయొచ్చని పేర్కొంది. అయితే ఈ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ట్యాక్స్ ఫైల్ చెయ్యడానికి సమయం ఎక్కువ పట్టడంతో పాటు మరి కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి.
గత రెండు నెలలుగా ఈ పోర్టల్ పని చేస్తోందని కానీ అప్పటి నుంచే సమస్యలు మొదలవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యపై పోర్టల్ తయారు చేసిన ఇన్ఫోసిస్ కంపెనీ ఎండి, సీఈవోతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడడడం జరిగింది. ఐతే రెండు వారాలలో సమస్యని పరిష్కరించనున్నారు అని అన్నారు. ఐతే ఈ సమస్య పరిష్కరిస్తేనే ఫైల్ చెయ్యడం కుదురుతుంది.