IPL 2022 : ఆర్సీబీ పేసర్​ హర్షల్​ పటేల్​ ఇంట్లో విషాదం

-

ఆర్సీబీ పేసర్‌ హర్షల్‌ పటేల్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. తన కుటుంబంలోని ఓ వ్యక్తి మరణించడంతో.. ఐపీఎల్‌ బయో బబుల్‌ ను వీడాడు పేసర్‌ హర్షల్‌ పటేల్‌. ముంబై ఇండియన్స్‌ తో శనివారం మ్యాచ్‌ అనంతరం.. హర్షల్‌ పటేల్‌ సోదరి మృతి చెందినట్లు సమచారం అందుతోంది.

ఇదే విషయాన్ని ఐపీఎల్‌ వర్గాలు కూడా పేర్కొన్నాయి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తదుపలి మ్యాచ్‌ కు ముందే తిరిగి బయో బబుల్‌ లో చేరతాడని ఐపీఎల్‌ యాజమాన్యం స్పష్టం చేస్తోంది.

కాగా.. బెంగళూరు జట్టులో హర్షల్‌ పటేల్‌ కీలక బౌలర్‌ గా మారాడు. కొన్ని సీజన్లు గా అద్భుత ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. శనివారం జరిగిన మ్యాచ్‌ లో ముంబై పై రెండు వికెట్లు పడగొట్టి దెబ్బ తీశాడు. గత సంవత్సరం ఏడాది అంతర్జాతీయ టీ 20 ల్లో అరంగేట్రం చేసిన హర్షల్‌ పటేల్‌.. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌ లు ఆడాడు. కాగా.. ఇప్పటి వరకు బెంగళూరు 3 మ్యాచ్‌ లలో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news