మనుషుల్లో సమానత్వం అన్నది ఆశించకండి అని చెబుతుంటారు. కానీ ఇవాళ సమానత్వం ఓ నినాదం అయి ఉందని తేలుతోంది.పైకి తేలి ఎందరినో ఆ ఊబిలో ముంచుతోంది. అవునో, కాదో కానీ మనుషుల్లో ఇవాళ అనుకున్నంత స్వేచ్ఛ లేదు.
స్త్రీ కు సంబంధించి స్వేచ్ఛ,సమానత్వం,సాధికరికత అనే నినాదాలు ఇవాళ అమలులో ఉన్నాయో లేవో అన్న మీమాంసకు అర్థం వేరుగా ఉంది.నేడు అంతర్జాతీయ మహిళల దినోత్సవం.ఈ రోజున కొన్ని సందర్భాలు కొన్ని సందళ్లను నింపుకుని ఉంటాయి.
కొన్ని సమయాలు ఆఫీసుల్లో ప్రత్యేకం అయి ఉంటాయి.ఉండాలి కూడా! మీరు టూ మచ్ చేస్తున్నారు ఇవాళ ఒక్కరోజేనా నేను మీకు ప్రత్యేకం అని కొందరు..లేదు,లేదు ఈ రోజుతో పాటు మిగిలిన రోజులు కూడా ప్రత్యేకమే అని ఇంకొందరు వాద,ప్రతివాదాలు వినిపిస్తున్న వేళ నెట్టింట ఓ పోస్టర్ హల్చల్ చేస్తోంది. ఆ ట్రెండ్ ఇన్ పోస్టర్ కహానీ ఇది.
గబ్బర్ సింగ్ సినిమా గుర్తుంది కదా! ఆ సినిమాలో హీరో హీరోయిన్ల పెళ్లి సన్నివేశాన్ని మిమేయర్స్ (కామిక్ పోస్టర్ డిజైనర్స్) హాయిగా తమకు అనుగుణంగా మార్చుకున్నారు.”మహిళల దినోత్సవం నేపథ్యంలో.. మహిళలు సంతోషంగా ఉండి.. భర్తలను కూడా సంతోషంగా ఉంచండి” అంటూ అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ పోస్టర్ పై మీమ్స్ క్రియేట్ చేసి తెగ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరమే ఈ వైరల్ పోస్టర్ కహానీ.. పవన్ ట్రెండ్ ను సెట్ చేస్తాడు..
ట్రెండ్ కు అనుగుణంగా తన డైలాగులనూ సెట్ చేస్తాడు.. అనేందుకు తార్కాణం లేదా ఉదాహరణ ఈ పోస్టరే ! ఎనీవే అమ్మాయిలూ మీరు హాయిగా ఉండి,మమ్మల్నీ హాయిగా ఉంచుతారని మా విన్నపం.
– ట్రెండ్ ఇన్ పోస్టర్ – మనలోకం ప్రత్యేకం