లింగ సమానత్వానికి మొదటి అడుగు ‘ఈవెన్ కార్గో’.. వారికోసమే మొదలైన సంస్థ 

-

సిటీల్లో ఉండే అమ్మాయిలకు ఉన్నంత స్వేఛ్చ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు ఉండదు. వారికి ధైర్యం కూడా తక్కువే. సమాజం అంటే భయం. అడుగుబయట పెట్టనివ్వరు. ఒకవేళా వెళ్లాలి అంటో తోడు కావాల్సిందే. అలాంటి వారికి ఆర్థిక స్వాంతంత్రం కల్పించాలనే ఉద్దేశంతో ఓ అబ్బాయి ‘ఈవెన్ కార్గో’ కు శ్రీకారం చూట్టాడు. లింగ సమానత్వానికి మొదటి అడుగు ఆర్థిక స్వేచ్చే.. మహిళలు సంపాదించినప్పుడే.. అన్ని విషయాల్లో స్వేచ్ఛంగా సమానంగా ఉంటారు. ఈ ఉద్దేశంతోనే.. కేవలం అమ్మాయిల కోసం.. ఓ అబ్బాయి చేసి కృషి ఏంటో చూద్దామా..!
2012 నిర్భయ ఘటన యోగేశ్‌ కుమార్‌ని తీవ్ర ఆలోచనలో పడేసింది. తను ఇంజినీర్‌. అమ్మాయిలకు సురక్షిత సమాజాన్ని అందించాలన్నదే తన అభిప్రాయం. ఇందుకోసం పోలీసు శాఖతో కలిసి యాప్‌లు, వగైరా విషయాల్లో కోడింగ్‌ పరంగా సాయమందించాడు. అయినా ఏదో అసంతృప్తి. ఈ క్రమంలోనే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో గడప దాటడానికి నోచుకోని అమ్మాయిలను చూశాడు. వాళ్లకి స్వేచ్ఛ, సమానత్వాలను కల్పించాలనుకున్నాడు. 2016లో ‘అమ్మాయిల చేత, అమ్మాయిల కోసం’ నినాదంగా దిల్లీలో ‘ఈవెన్‌ కార్గో’ని ప్రారంభించాడు.
ఇదో లాజిస్టిక్‌ డెలివరీ సంస్థ. దీనిలో పేద అమ్మాయిలను ఎంపిక చేసి, శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలనూ చూపిస్తారు. సంస్థ ప్రారంభమైన ఆరు నెలలకే కరీనా బాసిన్‌ అనే అమ్మాయి సహ వ్యవస్థాపకురాలైంది. ఈమెదీ లింగభేదం, గృహహింసలకు వ్యతిరేకంగా పోరాడాలన్న ఉద్దేశమే. అందుకే యోగేశ్‌తో చేతులు కలిపింది.
లాజిస్టిక్స్‌, ఈకామర్స్‌ డెలివరీ.. పురుషాధిక్య రంగం. దీనిలోకి మహిళల్ని ప్రోత్సహించడానికి, వారికి అవగాహన కల్పించడానికి కరీనా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎన్నో బెదిరింపులు. అయినా బృందాల్ని ఏర్పరచుకుని మురికివాడల్లో వాళ్లని కలిసి శిక్షణకు ఒప్పించింది. కొన్ని ప్రాంతాల్లో సుముఖంగా ఉన్నా.. అప్పటిదాకా ఇల్లు దాటని వాళ్లకు సంస్థ వరకూ బస్సులు, మెట్రోల్లో రావడం కాస్త ఇబ్బంది అయ్యేది. దీంతో వాళ్లు నివసించే ప్రాంతాల్లోనే శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేది.
సంస్థల వారితో మాట్లాడటం దగ్గర్నుంచి, వాహనాలు నడపడం వరకు అన్ని అంశాల్లో శిక్షణ సాగుతుంది. అలా 15 మందితో దిల్లీలో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు హైదరాబాద్‌, ఝార్ఖండ్‌, కోల్‌కతా, ముంబయి, నాగ్‌పూర్‌ సహా ఎన్నో నగరాల్లో విపరీతంగా సేవలందిస్తోంది. కొందరికి ఇతర ఈ కామర్స్‌ సంస్థల్లోనూ ఉద్యోగాలు కల్పించారు.. ఇప్పటివరకూ 5000కుపైగా అమ్మాయిలు సంస్థలో శిక్షణ పొందారు. నెలకు కనీసం రూ.20,000 వరకూ సంపాదించుకోగలుగుతున్నారు.. ఏదైనా కారణం తర్వాత ఉద్యోగం మాని, తిరిగి చేరాలనుకునేవారికీ కూడా అవకాశమిస్తున్నారు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news