మోడీకి తెలంగాణ సెగ.. ట్విట్టర్‌ లో #ModiEnemyOfTelangana ట్రెండింగ్‌

-

ప్రధాని నరేంద్ర మోడీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలపై పెద్ద దూమారమే చెలరేగుతోంది. రాజకయా నాయకుల నుంచే కాకుండా.. నెటిజన్లు నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మోడీ పై సామాజిక మాధ్యమాలలోతెలంగాణ ప్రజలు నిరసన వెల్లువెత్తుతోంది. పార్లమెంట్లో ప్రధాన మంత్రి మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ నెటిజన్లు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ కి మోడీ శత్రువు అంటూ #ModiEnemyOfTelangana హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ వేదికగా తమ ఆగ్రహాన్ని తెలియపరిచారు. కేవలం ఒక గంటలోనే 25వేలకు పైగా తెలంగాణ ప్రజలు ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా తమ నిరసనను తెలియజేశారు.

దీంతో #ModiEnemyOfTelangana ట్విట్టర్ ట్రెండింగ్ లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి దేశం దృష్టిని ఆకర్షిస్తున్నది. అటు మోడీ హేట్స్ తెలంగాణ హ్యాష్ టాగ్ తో ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. పార్లమెంటులో ప్రధాన మంత్రి మోడీ ప్రసంగం రెండు విషయాలను స్పష్టం చేసిందని.. తెలంగాణ ఆవిర్భావం కాంగ్రెస్ తోనే జరిగింది… టీఆర్ఎస్ పాత్ర లేదన్నారు. తెలంగాణ సమాజానికి మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news