తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి.. 25 వేల మందికి ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఈవీ రంగంలో 2100 కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చింది ట్రైటాన్(TRITON EV) ఈవీ. జహీరాబాద్ నిమ్జ్ లో తన ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధతను తెలిపింది ట్రైటాన్ ఈవీ. పెట్టుబడితో సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. తొలి ఐదేళ్లలో సుమారు 50 వేల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ప్రణాళికలు చేస్తోంది.

ట్రైటాన్ ఈవీ తమ పెట్టుబడి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుని.. ఇక్కడికి రావడం పట్ల మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పెట్టుబడితో దేశంలోనే ఎలక్ట్రిక్ వాహన రంగ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి కంపెనీలు ఇంకా ఎన్నో రావాలని.. వాళ్ళకు తగిన ప్రోత్సాహం ఉంటుందని కేటీఆర్ తెలిపారు. కంపెనీలు వస్తేనే స్థానికులకు ఉపాధి కలుగుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.