యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఈ నెల 22న అంటే సరిగా మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పర్యటించిన సంగతి తెలిసిందే. వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్.. ఆ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్బంగా.. వాసాలమర్రి గ్రామస్తులందరితో కలిసి భోజనం చేశారు సిఎం కెసిఆర్. అంతే కాదు అక్కడ టేబుళ్లపై కూర్చున్న గ్రామస్తుల దగ్గరికి వెళ్లి, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, భోజనం చేయాల్సిందిగా కోరారు. దీంతో గ్రామస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇది ఇలా ఉండగా.. వాసాలమర్రి లో సీఎం కేసీఆర్ తో కలిసి భోజనం చేసిన ఓ వృద్ధురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ వృద్ధురాలు ఎవరో కాదు.. సిఎం కెసిఆర్ పలకరించిన ఆకుల ఆగవ్వే ఈ వృద్దురాలు. సీఎం కేసీఆర్ పక్కనే కూర్చుని ఆగవ్వ భోజనం చేశారు. వాసాలమర్రి గ్రామంలో ఆగవ్వ దోస్త్ అని కూడా కేసీఆర్ చెప్పారు. అయితే.. సీఎం కేసీఆర్ మీటింగ్ పెట్టిన రోజు రాత్రే ఆగవ్వ తీవ్ర అస్వస్థత గురయ్యారు. దీంతో ఆమెను వైద్యం నిమిత్తం భువనగిరి లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించి గురువారం ఆమెను వైద్యులు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య కుదుట పడింది.