Godfather Trolls: తమన్ ఏందయ్యా ఇదీ.. ఇట్టా చేశావ్!!

-

చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గాడ్‌ఫాదర్‌. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. చిరు సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో మోహన్‌ రాజా కథను తీర్చిదద్దినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలోనూ గాడ్‌ఫాదర్‌ ట్రెండ్‌ నడుస్తోంది. అయితే, ఇదే సినిమాకు సంబంధించి మరో ట్రెండ్‌ కూడా కొనసాగుతోంది.

గాడ్ ఫాదర్
గాడ్ ఫాదర్

గాడ్‌ఫాదర్‌కు తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన సంగీత సారథ్యం వహించిన పలు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక నేపథ్య సంగీతమైతే, మరోస్థాయిలో ఉంటుందని ‘అఖండ’ వంటి చిత్రం ద్వారా నిరూపించారు. అయితే, ‘గాడ్‌ఫాదర్‌’ టీజర్‌లో మాత్రం మరో మెగా హీరో చిత్రానికి సంబంధించిన థీమ్‌ వినపడుతోందని నెటిజన్లు ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. వరుణ్‌ తేజ్‌ హీరో నటించిన ‘గని’ థీమ్‌ను మిక్స్‌ చేసి తమన్‌ ‘గాడ్‌ఫాదర్‌’కు పెట్టేశాడంటూ విమర్శలు వస్తున్నాయి. గతంలో తమన్‌ పాటలకు సంబంధించి ఇలాంటి పోలికలు ఎన్నో ఉన్నాయి. ఆ సినిమాకు కూడా తమనే మ్యూజిక్‌ డైరెక్టర్‌. సినిమా ఫ్లాప్‌ అయినా థీమ్‌ బాగుందని మిక్స్‌ చేసి వాడేశారా? లేక సమయం లేక ఇలా జత చేశారా? అన్నది తెలియడం లేదు. ఏదేమైనా ‘గాడ్‌ఫాదర్‌’కు స్పెషల్‌గా నేపథ్య సంగీతం ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక గాడ్‌ఫాదర్‌ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తయింది. మరోవైపు శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దసరా కానుకగా అక్టోబరు 5న ఈ చిత్రాన్ని తీసుకు వస్తామని చిత్ర బృందం ప్రకటించింది. మలయాళంలో మోహన్‌లాల్‌ నటించిన లూసిఫర్‌ రీమేక్‌గా గాడ్‌ఫాదర్‌ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news