కారు రివర్స్..ఆ సీట్లు కోల్పోవాల్సిందేనా!

-

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి కష్టాలు కొనసాగుతున్నాయి….ఇంతకాలం తిరుగులేని ఆధిపత్యంతో టాప్ పొజిషన్ లో ఉన్న కారు పార్టీకి ఇప్పుడు అంతా రివర్స్ అవుతుంది. వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకుని…మూడోసారి కూడా అధికారం దక్కించుకోవాలని చూస్తున్న టీఆర్ఎస్ పార్టీకి..ప్రజలు ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. గత రెండు ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న కారు ఎమ్మెల్యేలకు ఈ సారి ప్రజలు షాక్ ఇచ్చేలా ఉన్నారు.

రెండుసార్లు అధికారం ఇచ్చిన సరే…ప్రజలకు పెద్దగా ఒరిగింది ఏమి కనబడటం లేదు. పైగా కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతల అక్రమాలు, దందాలు, సెటిల్మెంట్లు ఎక్కువయ్యాయనే టాక్ వినిపిస్తోంది. అలాగే ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నట్లు కనిపిస్తున్నారు. ఏదో ప్రభుత్వం తరుపున అందుతున్న పథకాలు తప్ప..ప్రజలకు వచ్చేది ఏమి లేదని తెలుస్తోంది. దీంతో ప్రజలు ఈ సారి కారుని రివర్స్ చేసేలా ఉన్నారు..టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు చెక్ పెట్టేలా ఉన్నారు.

ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనబడుతుంది…ఇక ఆ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపు చాలా కష్టమని తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కారుకు కష్టాలు పెరిగాయి. ఈ రెండు జిల్లాల్లో మొత్తం 22 సీట్లు ఉండగా…అందులో జంపింగ్ ఎమ్మెల్యేలతో కలిపి…టీఆర్ఎస్ పార్టీకి 19 సీట్లు ఉన్నాయి. 3 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి.

అయితే ఈ 19 సీట్లలో టీఆర్ఎస్ ఈసారి 9 సీట్లు గెలుచుకున్న గొప్పే అని తెలుస్తోంది. ఎందుకంటే ఎక్కడకక్కడ టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతుంది. నల్గొండలో చూసుకుంటే సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నకిరేకల్ లాంటి స్థానాల్లో కారుకు వ్యతిరేక గాలులు వీస్తున్నాయి.

అటు ఖమ్మంలో కొత్తగూడెం, పినపాక, ఇల్లందు, పాలేరు, అశ్వరావుపేట, వైరా లాంటి స్థానాల్లో కారుకు అనుకూల పరిస్తితులు లేవు. మొత్తానికి చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఈ సీట్లలో కారు గెలుపు కష్టమయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news