టీఆర్‌ఎస్ పార్టీ దుబ్బాకల ఉప ఎన్నికల్లో చేసిన తప్పే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేస్తున్నట్లు కనిపిస్తుంది..దుబ్బాకలో చివరి వరకూ అభ్యర్థిని ప్రకటించకుండా అలస్యం చేసిన టీఆర్‌ఎస్ ఇప్పుడు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేస్తున్నారు.అభ్యర్థిని ప్రకంటించకుండా చివరి వరకూ సస్పెన్షన్లో ఉంచటం వల్ల టీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తుందని విశ్లేషకులు అంటున్నారు..దుబ్బాకలో అభ్యర్థి విషయంలో చేసిన పోరపాటు వల్ల పార్టీ భారీ మూల్యం చేల్లించుకుంది..ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే విధానం అనుసరిస్తే దుబ్బాక ఫలితాలే రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు..దీంతో టీఆర్‌ఎస్‌కి కోలుకోని దెబ్బతగులుతుంది..
ఇప్పటి వరకూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను ప్రకటించలేదు కాబట్టి..టీఆర్‌ఎస్ కూడా అభ్యర్థిని ప్రకటించడంలేదని ఇకవాదన..కాని ప్రతి పక్షాలు ఇప్పటికే జిల్లాలో వారి వారి క్యాడర్‌ను అప్రమత్తం చేస్తున్నాయి..ఎన్నికలకు సిద్దం కావాలని సూచనలు ఇస్తున్నాయి..వాటితో పోల్చుకుంటే టీఆర్‌ఎస్ పార్టీకి నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు లొకల్ లీడర్లు.
మరోవైపు తెలంగాణ ఇంటీ పార్టీ అధ్యక్షుడు..మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు డా.చెరుకు సుధాకర్ గత కొంత కాలంగా నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు..తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమ దేవి వంటి వారు ప్రచారంలో ముందుకుపోతున్నారు..తెలంగాణలో వామపక్షాల తరుపున పోటీ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కూడా నిత్యం విద్యార్థి,యువజన సంఘాలతో భేటీ అవుతున్నారు..పట్టభద్రుల ఎన్నికల్లో కీలకంగా మారిన నిరుద్యోగులను, యువతను ఆకర్షించడం మెదలుపెట్టారు.
టీఆర్‌ఎస్‌మాత్రం విజయం మనదే అన్న ధీమతో ఉన్నట్లు తెలుస్తుంది..ఇది ఓవర్ కాన్ఫ్‌డెన్స్ అంటున్నారు యువత..ఇప్పటికే పట్టణ ఓటర్లు టీఆర్‌ఎస్ పార్టీకి క్రమంగా దూరం అవుతున్నారు..ఎన్నో ఆశాలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువత,నిరుద్యోగులు..ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది..దుబ్బాక అర్బన్ ఓట్ల శాతమే అందుకు ప్రత్యేక నిధర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..పట్టభద్రుల ఎన్నికలు అంటే కేవలం చదువుకున్న పట్టభద్రులు మాత్రమే ఎన్నికల్లో ఓటు వేస్తారు.. ఈ ఎన్నికల్లో యువత కీరోల్ పోషిస్తారు…మరి వారి అశయాలకు అనుగూణంగా పార్టీ విధానాలు లేకపోతే..నిద్యోగులు ప్రత్యమ్నయం వైపు చూస్తారు..ఇప్పడు తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు యువతలో అసంతృప్తిని కలిగించాయి..అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానని హమీ ఇచ్చి..
గత ఏడు సంవత్సారాలుగా ఇచ్చిన హమీని నిలబెట్టుకోలేకపోయింది టీఆర్‌ఎస్..కొత్త ఉద్యోగల నోటీఫికేషన్ లేదు..ఎంట్రస్ టెస్ట్ పెట్టిన వాటికి కొన్నింటికి ఫలితాలు ఇవ్వలేదు..కాలేజీలు..యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత..కొన్ని వర్సిటీలకు వీసీలే లేరు..కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కూల్స్, విద్యాయలయాల్లో నిధుల కొరత…ఇలా చెప్పుకుంటూ పోతూ..ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రభావితం చేస్తే రంగాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విద్యారంగ నిఫుణులు అంటున్నారు..ఈ సమస్యలను వీలైనంత త్వరగా ఈ సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టకపోతే భారీ ఓటమి తప్పదంటున్నారు..వీలైనంగా వేగంగా పార్టీ అభ్యర్థిని ప్రకటించి..పై సమస్యలపై సరైన సమయంలో అడ్రస్ చేయకపోతే విద్యావంతుల్లో పార్టీపై మరింత వ్యతిరేకత ఏర్పడుతుంది..అది రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై మరింత ప్రభావం చూపిస్తుంది అంటున్నారు అనలిస్ట్‌లు..