టిడిపికి షాక్ : టీఆర్ఎస్ లోకి ఎల్. రమణ..!

ఈటల ఎపిసోడ్ తో కరీంనగర్ రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. పార్టీలతో సహ తెలంగాణ ప్రజలు కరీంనగర్ రాజకీయాలపై ప్రస్తుతం దృష్టి సారించారు. అటు టిఆర్ఎస్ పార్టీ ఈటల స్థానాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశంతో అనేక ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా ట్రబుల్ షూటర్ హరీష్ రావును.. రంగంలోకి దించింది. హుజరాబాద్ లో ఎలాగైనా గెలవాలని టిఆర్ఎస్ వ్యూహరచనలు చేస్తోంది. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణను పార్టీలోకి తీసుకోవాలని టిఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఇందులో బాగంగా ఎల్.రమణతో గులాబీ నేతలు మంతనాలు కూడా జరుపుతున్నారు.

అంతేకాదు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మరియు ఇతర గులాబీ నేతలు స్వయంగా ఎల్ రమణకు ఫోన్ చేసి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈటెల రాజీనామాతో ఖాళీ అయిన బీసీ నాయకుడి స్థానాన్ని మరొక బిసి నాయకునితోనే భర్తీ చేయడానికి టిఆర్ఎస్ అధిష్టానం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఎల్.రమణకు టిఆర్ఎస్ గాలం వేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు టిఆర్ఎస్ లోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఎల్.రమణ కు అధిష్టానం భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.