హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కాసేపటి క్రితమే.. ప్రారంభం అయింది. కరీంనగర్ లోని ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలలో ప్రారంభం మైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 753 పోస్టల్ బ్యాలె్ ఓట్లు నమోదు అయ్యాయి.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిపు అనంతరం ఈవీఎంలోని ఉన్న ఓట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లో ప్రస్తుతానికి టీఆర్‌ఎస్ పార్టీ ఆధిక్యం లో ఉన్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అయితే… ఎన్ని ఓట్ల తేడా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఉదయం 9.30 గంటలకు తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వచ్చే చాన్స్ ఉంది. హుజురాబాద్ ఎన్నికల్లో 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక అటు బద్వేల్ ఉప ఎన్నిక లోనూ… వైసీపీ పార్టీ ఆధిక్యం లో ఉన్నట్లు అధికారులు కాసేపటి క్రితమే.. ప్రకటించారు. మ రి కాసేపట్లోనే..ఈవీఎం లో ఉన్న ఓట్లు లెక్కించనున్నారు.
హుజురాబాద్ పోస్టల్ బ్యాలెట్ లో TRS హవా
మొత్తం 723 ఓట్ల లో
503 TRS
159 BJP
32 కాంగ్రెస్
14 చెల్లని ఓట్లు