తెలంగాణ రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా గులాభి కమలం పార్టీల మధ్య వాగ్వాదం రచ్చకెక్కుతుంది. అటు గులాభి నేతలపై కమలం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. ఇటు కమలం నేతలపై విమర్శల బాణాలు వేస్తున్నారు గులాభీ లీడర్లు. ఈ నేపద్యంలో తెలంగాణ పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ నేతలపై పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా నియంత్రణకు కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజ్ డొల్ల అని వాటిని ఏం చేశారు చెప్పమని ఆయన ప్రశ్నించారు.
ఆ భోగస్ ప్యాకేజీతో కనీసం వలస కూలీలు కూడా లాభపడలేదని సొంతూళ్ళకి పంపించేందుకు కూడా ఛార్జీలు ఇవ్వలేకపోయిందని ఆయన కేంద్రం పై మండిపడ్డారు. కరోనా కట్టడికి బీజేపీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు, చప్పట్లు కొట్టించారు దీపాలు వెలిగించమన్నారు తప్ప చేసిందేమి లేదని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు ఉన్నాయని అది వారి పాలనకు ఉదాహరణ అని ఆయన సెటైర్ వేశారు. కోవిడ్ 19 భారత్ చైనా బర్డర్లలోని సమస్యల అంశాలపై మాట్లాడవద్దని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని అంతేతప్ప ఎవ్వరికీ భయపడేది లేదని ఆయన అన్నారు.