బట్టలు ఉతికెందుకు చెరువుకు వెళ్లిన ఐదుగురు స్నేహితులు మళ్ళీ తిరిగి వెనక్కి రాలేదు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది, వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర లోని జల్నా జిల్లాకు చెందిన అయిదుగురు బాలికలు బట్టలు ఉతికెందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. చెరువులోకి దిగి బట్టలు ఉతుకుతుండగా చెరువులోని పూడికను గమనించక అందులో చిక్కుకుపోయారు. ఎంత అరుస్తున్నా చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోయేసరికి పీకల్లోతుకీ మునిగిపోయారు. చివరి క్షణంలో అటుగా వెలుతున్న వారు ప్రమాదాన్ని గమనించి కాపాడేందుకు యత్నించినా ఎవ్వరిని కాపాడలేకపోయారు. వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా వారు మృతిచెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. మరినించినవారిలో అశుబీ లతీఫ్ పఠాన్ (6), నబియా నవాజ్ పఠాన్ (6), అల్ఫియా గౌస్ ఖాన్ పఠాన్ (7), సానియా అస్లాం పఠాన్ (6), షాబు అస్లాం పఠాన్ (5). ఐదుగురు చిన్నారుల ప్రాణాలు ఒక్కసారిగా పోయేసరిగి ఊరంతా విషాద సముద్రంలో మునిగిపోయింది.
ఐదుగురు చిన్నారులని మింగేసిన చెరువు..! అందరూ 7 ఏళ్ల లోపు వారే..!
-