వరద నీటిలో చిక్కుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు

హైదరాబాద్: రాత్రి కురిసిన వర్షాలకు ఎల్బీనగర్‌లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి కారు వరదల్లో చిక్కుకుంది. గుంతలో కారు ముందు టైరు ఇరుక్కుపోయింది. కారును బయటకు తీసేందుకు చాలా సమయం పట్టింది. చివరకు వరద ప్రవాహం తగ్గడంతో కారు బయటకు వచ్చింది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్తుండగా హస్తినాపురం వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి కారు దిగి సెక్యూరిటీతో కలిసి కారును ముందుకు నెట్టారు.

ఇక రాత్రి ఎల్బీనగర్ ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. పలు కాలనీలు, ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరింది. రోడ్లపైకి నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.