నేడు ఈడీ విచారణకు టిఆర్ఎస్ ఎంపీ నామా

-

ఖమ్మం, టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు నేడు ఈడీ విచారణకు రానున్నారు. నేడు విచారణకు హాజరు కావాలని నామాకు ఇప్పటికే ఈడీ సమన్లు పంపింది. బ్యాంకు రుణాలను మళ్లించిన కేసులో నామా నాగేశ్వరరావుకు సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. మదుకాన్ కేసులో నిందితులందరికీ సమన్లు ఇచ్చిన ఈడీ… మదుకాన్ గ్రూప్ డైరెక్టర్ల ఇళ్లల్లో.. ఇటీవలే రెండు రోజుల పాటు సోదాలు జరిపారు ఈడీ అధికారులు. సోదాల్లో భారీగా దస్త్రాలు, లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఈడీ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దస్త్రాలు, ఖాతాలు, హార్డ్ డిస్కులను ఈడీ బృందాలు విశ్లేషిస్తున్నారు.

కాగా… ఈడీ నోటీసులు జారీ చేసిన అనంతరం జూన్‌ 19న ఎంపీ నామా నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందూ. నేను ఎప్పడు జీవితంలో నీతి… నిజాయితీతో ఉంటున్నానని.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని పేర్కొన్నారు. నా బలం కేసీఆర్… ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన వెంటే ఉంటానని స్పష్టం చేశారు నామా. 40 ఏళ్ళ క్రితమే మధుకన్ ను స్థాపించానని… రాత్రిపగలు కష్టపడ్డానన్నారు. మధుకన్ అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేసిందని.. ఏ కంపెనీలలో నేను డైరెక్టర్ గా లేనని నామా తేల్చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news