వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లేటప్పుడు నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో తెలుసా..?

-

భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతోంది. వ్యాక్సిన్ పట్ల అవగాహన ఉండడం చాలా ముఖ్యం. వ్యాక్సిన్ వేయించుకునే ముందు మంచి నీళ్లు తాగడం వల్ల వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కాంప్లికేషన్స్ ఉండవని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం మరెన్నో విషయాలని ఇప్పుడు చూసేద్దాం.

వాక్సిన్ వేయించుకున్న తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్:

సాధారణంగా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత చాలా మందిలో సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతున్నాయి. యాంటీ బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ లోకి డిఫెన్స్ మోడ్ లో వెళ్తాయి. ఈ క్రమంలో సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉంది.

నీళ్లు తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయా…?

నీళ్ల ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయని ఎటువంటి ఆధారం లేదు. అయితే వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ఉంటుంది. కనుక అటువంటి సమయంలో హైడ్రేట్ గా ఉండటం మంచిది. ఎక్కువ ఫ్లూయిడ్స్ ఉండడం వల్ల హైడ్రేట్ గా ఉంటారు. అదే విధంగా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కళ్ళు తిరగడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతాయి. ఇటువంటివి కలగకుండా ఉండాలంటే నీళ్లు తాగడం వల్ల మనకి సహాయపడుతాయి.

అదే విధంగా స్టడీ ప్రకారం ఎక్కువ మంచి నీళ్ళు తాగితే కూడా ఇబ్బందే. సోడియం లెవెల్స్ డ్రాప్ వల్ల తలనొప్పి, నీరసం వంటి సమస్యలు వస్తాయి. వ్యాక్సిన్ కి వెళ్లేటప్పుడు ఆరోగ్యంగా ఉండే పెద్ద వాళ్ళు కొద్దిగా మంచినీళ్లు తాగి వెళ్లడం మంచిది.

యునైటెడ్ స్టేట్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లే ముందు మంచి నీళ్లు తాగడం వల్ల బాగా ఉపయోగకరమని హైడ్రేట్ గా ఉంచుతుంది అని.. అలాగే ఇతర బెనిఫిట్స్ కూడా దీని ద్వారా పొందవచ్చని అన్నారు.

వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత గ్రీన్ టీ తాగితే మంచిది. ఇలా చేయడం వల్ల తిరిగి హైడ్రేట్ అవ్వచ్చు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ బూస్ట్ అవుతాయి. వీటితో పాటుగా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎనర్జీ గా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news