వ్యవసాయ బిల్లులపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గి… పునరాలోచించేవరకు సభలోకి వచ్చేది లేదని రాజ్యసభ నుంచి తృణముల్ కాంగ్రెస్, టీఆర్ఎస్ సహా ఆప్, కాంగ్రెస్ పార్టీల విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేసారు. అప్పుడే సభలోకి వస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇక రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఎంపీలు వ్యవహరించిన తీరుకు నిరసనగా డిప్యూటీ ఛైర్మన్ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టడం విశేషం. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కూడా రాజ్యసభ సమావేశాలను బహిష్కరించే అవకాశం ఉంది. ఆప్ కూడా బహిష్కరించడానికి సిద్దంగా ఉందని తెలిసింది. అయితే సభ్యులను సస్పెండ్ చేయడంపై తాను హ్యాపీగా లేను అని ప్రకటించారు చైర్మన్ వెంకయ్య నాయుడు.