మున్సిపల్ అధికారులకు క్యాన్సర్‌ రోగం – టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

జగిత్యాల నియోజక వర్గ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే డా. సంజయ్‌ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాకర్స్ వెలిఫేర్ అసోసియేషన్ మీటింగ్ లో  సందర్భంగా అధికారులకు క్యాన్సర్‌ రోగమని… జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కామెంట్స్ చేశారు. జగిత్యాల మున్సిపల్ పాలక వర్గానికి క్యాన్సర్ వచ్చిందని… జగిత్యాల బల్దియా రోగం త్వరలో బాగు చేయాలని పేర్కొన్నారు.

అయితే… ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే… ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఫైర్‌ అవుతున్నారు. ప్రభుత్వ అధికారులను.. ఇలా ఎలా అంటారని నిప్పులు చెరుగుతున్నారు ప్రతి పక్ష నేతలు. ప్రభుత్వ అధికారులపై సంజయ్‌ కుమార్‌ చేసిన ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని… డిమాండ్‌ చేశారు నేతలు. అయితే.. దీనిపై సంజయ్‌ కుమార్‌.. ఇప్పటి వరకు స్పందించలేదు.