నేడు తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ నిరసనలు

-

గత కొన్ని రోజుల నుంచి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. బాయిల్డ్ రైస్ కొన బోమని.. కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే.. కొన్ని తీరాల్సిందేనని అధికార టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితి అగొమ్యచరంగా తయారైంది. ఈ నేపథ్యంలోనే… కొన్ని రోజుల నుంచి బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ నిరసన తెలుపుతుంది.

ఇందులో భాగంగానే ఇవాళ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది టిఆర్ఎస్ పార్టీ. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో నిరసనలు చేపట్టనుంది. ప్రతి గ్రామంలో ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించి.. కేంద్ర ప్రభుత్వ ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో జరిగిన ఆందోళనలో మంత్రి కేటీఆర్ సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతుబంధు నాయకులు పాల్గొన్నారు. అటు ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రులను ధాన్యం కొనుగోలు విషయంపై కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news