ఈటలపై సీరియస్.. చిట్టా రెడీ!

-

: మాజీ హైదరాబాద్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల వ్యవహారం‌పై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌ అయింది. పార్టీ నుంచి బహిష్కరించి, ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసే యోచనలో ఉంది. ఇప్పటికే ఈటలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్‌కు కరీంనగర్ జిల్లా నేతలు లేఖ ఇచ్చారు. ఇక ఈటలపై చర్యలు సీఎం కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని తెలుస్తోంది. ఎమ్మెల్యే, మంత్రి పదవిని ఈటల దుర్వినియోగం చేశారని, రాజ్యాంగానికి తూట్లు పొడిచారని, చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరనున్నారట. కరోనా నుంచి కోలుకున్న ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్‌కు రానున్నారు. ప్రగతి భవన్‌లో పార్టీ నేతలతో చర్చించి ఈటల ఎపిసోడ్‌కు ఎండ్ కార్డు వేయనున్నట్లు ఆ పార్టీ వర్గాల చెబుతున్న మాట.

ఇక దేవరయాంజల్ భూముల వ్యవహారంలో ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి టీఆర్ఎస్ అధిష్టానం తొలగించింది. ఎమ్మెల్యే పదవికి కూడా రాజానామా చేయాలని ఈటలకు సూచించింది. కానీ ఈటల రాజేందర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజీనామా విషయాన్ని తాను ఎమ్మెల్యేగా గెలిచిన హుజురాబాద్ ప్రజల అభిప్రాయం ఈటల తీసుకున్నారు. ఈటలను రాజీనామా చేయొద్దని నియోజకవర్గ ప్రజలు సూచించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే టీఆర్ఎస్ నేతలు ఈటలను టార్గెట్ చేశారు. అక్రమంగా ఈటల వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news