ఉప్పు అధికంగా వాడద్దు అని ఎప్పటి నుంచో వింటున్న మాట. ముఖ్యంగా ఉప్పు ఎక్కువ తింటే గుండె జబ్బులు లేదా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బుధవారం ప్రకటించింది. తాజాగా ఉప్పులో సోడియం కంటెంట్‌కు లిమిట్ పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సంవత్సరం 11 మిలియన్ల మంది డైట్ పాటించకుండా ఇష్టానుసారంగా ఉండటం వల్లనే చనిపోతున్నారని తెలిపింది. అందులో 3 మిలియన్ల మంది సోడియం ఎక్కువ శాతం తీసుకోవడమే ప్రధాన కారణం. ధనిక దేశాలు, పేరుగుతున్న పేదరికంతో సోడియం అధికంగా ఉంటున్న ఫుడ్‌ను తీసుకోవడం వల్ల చనిపోతున్నారు. వారు బేకింగ్ ఫుడ్.. బ్రెడ్, పప్పులు, ప్రాసెస్డ్ మీట్, డైయిరీ ప్రాడాక్ట్స్ వల్ల వస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
ఉప్పు రసాయనిక నామం సోడియం క్లోరైడ్. సోడియం అంటేనే మినరల్. ఇది శరీరంలోని నీటి శాతాన్ని క్రమబద్ధీకరణ చేస్తుంది. ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించేందుకు అధికారులు కొన్ని పాలసీలు తప్పకుండా జారీ చేయాలి. ప్రజలకు కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే మంచిదో చెప్పాలని డబ్ల్యూహెచ్‌ఓ జనరల్ డైరెక్టర్ టెడ్రాస్ అధానమ్ గెబ్రియాసిస్ తెలిపారు. ప్రాసెస్డ్ ఫుడ్‌లో సోడియం శాతాన్ని తగ్గించే విధానాన్ని అమలు చేయాలన్నారు. దీనికి సంబంధించి 64 రకాల ఫుడ్, డ్రింక్‌ల కేటగిరీలుగా చేశారు. దానికి సంబంధించిన గైడ్‌లైన్స్ 194 వైద్యాధికారులు, బివరేజెస్ ఇండస్ట్రీ అధికారులతో చర్చలు జరపనున్నారు. ఉదాహరణకు పొటాటో చిప్స్‌లో 500 ఎంజీ సోడియం, 100 గ్రా ప్యాకెట్లో ఉంటుంది. ప్రాసెస్డ్ మీట్‌లో 360 గ్రా. ఉంటుంది. అధికశాతం సోడియం తీసుకోవడం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. దీనివల్ల కార్డియక్ వ్యాధులు పెరుగుతాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. దీనివల్ల మరణం కూడా సంభవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 32 శాతం చావులు ఇటువంటివేనని చెప్పింది. అదేవిధంగా ఒబేసిటీ, కిడ్నీ వ్యాధులు, గ్యాస్ట్రిక్ కేన్సర్ కూడా వస్తుంది. అందుకే ప్రతిరోజూ 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పును వినియోగించాలని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.