టీఆర్ఎస్ పార్టీ విజయవంతంగా నిర్వహించ తలపెట్టిన విజయగర్జన బహిరంగ సభ వాయిదా పడింది. ఈనెల 15ను ముందుగా వరంగల్ లో విజయగర్జన సభ నిర్వహించాలని టీఆర్ఎస్ భావించింది. అయితే దీన్ని నవంబర్ 29 వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 29న దీక్షాదివాస్ కావడంతో అదే రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ రోజు వరంగల్ లో జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం మంత్రులు వరంగల్ శివారులోని సభ జరిగే ప్రాంతాలను పరిశీలించారు. అంతలోనే సభ వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
టీఆర్ఎస్ పార్టీ విజయగర్జన సభను వరంగల్ లో అట్టహాసంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంది. దీని గురించి గతంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడ తెలిపారు. ఇటీవల పార్టీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ టీఆర్ఎస్ ప్లీనరీ విజయవంతంగా జరిగింది. అయితే కోవిడ్ కారణంగా కేవలం పార్టీ నాయకుల వరకే ఆహ్వానించారు. దీని తరువాత ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో విజయగర్జన సభ పేరుతో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంటుందని గతంలోనే పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం వాయిదాతో బహిరంగ సభ ఈనెల 15 నుంచి 29కి మారింది.