క్యాన్సర్ నుండి గుండె సమస్యలు వరకు స్ట్రాబెర్రీస్ తో మాయం..!

-

స్ట్రాబెర్రీస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సి, యాంటి యాక్సిడెంట్స్, సాలిసిలిక్ యాసిడ్ మరియు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. రుచిగా ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. ఆరోగ్యానికి జుట్టు ఆరోగ్యానికి చర్మానికి కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈరోజు స్ట్రాబెర్రీస్ వల్ల ఎలాంటి ప్రయోజనం పొందవచ్చు అనేది తెలుసుకుందాం. స్ట్రాబెర్రీస్ లో ప్రోటీన్, విటమిన్స్, ఐరన్, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం విటమిన్ ఏ ఉంటాయి.

 

గుండె ఆరోగ్యానికి మంచిది:

స్ట్రాబెర్రీస్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సర్క్యులేటరీ సిస్టంని అభివృద్ధి చేయడానికి కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేయడానికి స్ట్రాబెర్రీలు బాగా ఉపయోగపడతాయి. అలానే అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గిస్తాయి.

క్యాన్సర్ సమస్య ఉండదు:

స్ట్రాబెర్రీలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అలానే యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఉంటాయి. దీనితో క్యాన్సర్ సమస్య తగ్గుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

స్ట్రాబెరీలలో రోగనిరోధక శక్తి పెంపొందించే గుణాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా తీసుకుంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.

మెదడుకి మంచిది:

ఇందులో యాంటీఆక్సిడెంట్లు బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి కాబట్టి మెదడు ఆరోగ్యం కోసం కూడా స్ట్రాబెర్రీలు మనకి బాగా ఉపయోగపడతాయి.

కంటి ఆరోగ్యానికి మంచిది:

స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇలా ఇన్ని లాభాలని మనము స్ట్రాబెరీస్ తో పొందొచ్చు

Read more RELATED
Recommended to you

Latest news