భారత్ కు మరో విజయం…. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ను గుర్తించిన 5 దేశాలు.

-

కోవిడ్ విషయంలో భారత్ కు మరో విజయం దక్కింది. తాజాగా మరో 5 దేశాలు భారత వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ను గుర్తించాయి. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పరస్పర గుర్తింపులో భాగంగా ఈ దేశాలు భారత వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ను గుర్తించున్నాయి. కిర్గిజ్ స్థాన్, మంగోలియా, స్టేట్ ఆఫ్ పాలస్తీనా, ఎస్టోనియా, మారిషస్ దేశాలు పరస్పర గుర్తింపుకు అంగీకరించాయని విదేశాంగ ప్రతినిధి అమరిందర్ బాగ్చీ తెలిపారు. ఇటీవల ఇటలీలో జరిగిన జీ 20 సదస్సులో ప్రధాని మోదీ పరస్పర గుర్తింపు అంశాన్ని ప్రస్తావించారని విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్ ష్రింగ్లా గుర్తు చేశారు. ఈ గుర్తింపుతో ఈ దేశాల మధ్య ఎటువంటి ఇబ్బందులు లేక ప్రజలు ప్రయాణించే వీలు కలిగింది. గత నెల ఇదే విధంగా హంగేరీ, సెర్బియా కూడా ఇదే విధంగా పరస్పరం కోవిడ్ సర్టిఫికేట్ గుర్తింపునకు అంగీకరించాయి. 

తాజాగా సోమవారం ఉదయం భారత్ బయోటెక్ తయారీ కోవాగ్జిన్ ను గుర్తిస్తూ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. దీంతో కోవాగ్జిన్ వేసుకున్న ప్రయాణికులు ఆస్ట్రేలియా వెళ్లాలంటే ఎటువంటి నిబంధనలు అడ్డురావు. ముఖ్యంగా ఆస్ట్రేలియా వెళ్లి చదువాలనుకుంటున్న కోవాగ్జిన్ టీకా తీసుకున్న విద్యార్థుకు ఇబ్బందులు తొలిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news