రమణా… ఆర్మీ వస్తుందిరా.. జాగ్రత్తగుండాలా?

-

ఎవరు ఎన్ని చెబుతున్నా, ఎంత చెబుతున్నా… రోడ్లపైకి వచ్చేవారు వస్తూనే ఉన్నారు! ప్రాణాలకు తెగించి వైద్యం అందిస్తున్నవారిపై దాడులు చేస్తూనే ఉన్నారు. భౌతిక దూరం అనే సంగతి లాఠీ కనిపిస్తే తప్ప గుర్తుతెచ్చుకోవడం లేదు! ఇప్పటికీ అక్కడక్కడా మతపరమైన సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు సైతం వివాహ కార్యక్రమాలు నిర్వహించేస్తున్నారు! కొందరు ఎమ్మెల్యేలు ఏకంగా కాన్వాయ్ లలో ప్రయాణించేస్తున్నారు! ఈ తరుణంలో ఆర్మీని దించడమే సరైన ఆలోచన అంటున్నారు కొందరు సామాజిక కార్యకర్తలు. ఈ క్రమంలో సుప్రీంలో ఒక పిటీషన్ కూడా దాఖలు చేశారు!

ముంబైకి చెందిన ఒక సామాజిక కార్యకర్త తరఫున న్యాయవాదులు దుష్యంత్ తివారి, ఓం ప్రకాష్ లు సుప్రీంలో ఈ మేరకు ఒక పిటిషన్ ఈ దాఖలు చేశారు. లాక్‌ డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో వైద్య సిబ్బందిపై దాడులు చేయడం.. తప్పుడు వార్తలు ఆధారంగా పెద్దఎత్తున జనాలు గుమిగూడడం.. ఇప్పటికీ మతపరమైన సమావేశాలు జరుగుతుండటంతో ఆర్మీని రంగంలోకి దించాల్సిన అవసరం ఉందని సదరు పిటిషనర్ పేర్కొన్నారు. దేశంలో అనేక చోట్ల ప్రజలు గుమిగూడడంపై జాతీయ దర్యాప్తు సంస్థ తో విచారణ జరిపించాని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. వీటికి మరింత బలం చేకూర్చేలా… 14న ముంబైలో వలస కూలీలు పెద్దఎత్తున గుమిగూడిన అంశాలని, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి.. వివాహ కార్యక్రమాన్ని నిర్వహించడం… ఇలాంటి సందర్భాలను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవ్వడం తరచూ జరుగుతున్నాయని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు!

దీంతో… త్వరలో ఆర్మీని దింపే అవకాశాలు లేకపోలేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జనాలను కంట్రోల్ చేయడం పోలీసులకు తలకుమించిన భారంగా మారడంతో ఆర్మీని దింపడం సరైన చర్యే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం అప్పుడైనా జనం ఇంటిపట్టున ఉంటారనేది విశ్లేషకుల అభిప్రాయం! దీంతో… ఈ పిటిషన్ పై సుప్రీం ఓకే అంటే మాత్రం… తొందర్లో దేశవ్యాప్తంగా ఆర్మీ కవాతులు మొదలవుతాయన్నమాట!

Read more RELATED
Recommended to you

Latest news