లాఫింగ్ బుద్ధ గురించి అందరికీ తెలుసు. పెద్ద పొట్ట వేసుకుని చేతిలో సంచి పట్టుకుని ఉండే లాఫింగ్ బుద్ధని ఆఫీసుల్లో, ఇళ్ళలో ఉంచుకుంటారు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఐతే లాఫింగ్ బుద్ధాకి పోటీ అన్నట్లుగా ట్రంప్ బుద్ధ విగ్రహాలు వస్తున్నాయి. అవును మీరు చదువుతున్నది నిజమే. అమెరికాకి అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాలు పనిచేసిన ట్రంప్, ఈ సారి ఎలక్షన్లలో ఓడిపోయారు. అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ విపరీతంగా చర్చల్లోకి వచ్చాయి.
తాజాగా ట్రంప్ బుద్ధ విగ్రహాలతో మరో మారు చర్చల్లోకి ట్రంప్ వచ్చారు. చైనాలోని శిల్ప కళాకారులు ట్రంప్ విగ్రహాన్ని బుద్ధుడు ధ్యానం చేస్తున్న ఆకారంలో విగ్రహాలని తయారు చేసి ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టాడు. వీటిని చైనాలో భలే గిరాకీ ఏర్పడింది. ఇలా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు శిల్ప కళాకారులు ట్రంప్ బుద్ధ విగ్రహాలను తయారు చేస్తున్నారు. వీటి ధర కూడా ఖరీదుగా ఉంది. 18ఇంచుల విగ్రహానికి 650అమెరికా డాలర్లుగా ఉండగా 6ఇంచుల విగ్రహానికి 150అమెరికా డాలర్లుగా అమ్ముడవుతున్నాయి.