అమెరికాలో దాడులకు ట్రంప్‌ కుట్రలు..అప్రమత్తమైన వాల్ స్ట్రీట్..!

ప్రపంచమంతా ఆసక్తితో ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ముగింపు దశకు చేకుంది..బిడైన్‌ గెలుపు దాదాపు ఖాయం అయినప్పటికి..పూర్తి ఫలితాలపై ప్రపంచ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొన్నది..మరోవైపు కౌంటింగ్‌పై ట్రంప్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు..దీంతో అధ్యక్షుడి ప్రకటన కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి..ఇటీవలె ఎన్నికల కౌంటింగ్‌కు ముందు ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వాల్ స్ట్రీట్లో ఆందోళనల నెలకొంది..ఎన్నికల్లో ఓడిపోతే పదవి మార్పిడి అంత ఈజీగా జరగదని ప్రకటించారు ట్రంప్‌..ఇక వేళ ఓడిపోతే అమెరికా వదిలి వెళ్లిపోతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..ఎన్నికల కౌంటింగ్ ముందు ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అమెరికాల సామాన్యులు అందోళన చెందుతున్నారు..

ఇప్పటికే కౌంటింగ్ ట్రెండ్ ను అంచనా వేసిన ట్రంప్‌ మద్దతుదారులు అనేక చోట్ల వీధులకు ఎక్కారు..వీధుల్లో ఆందోళనలఉ చేస్తున్నారు..పలు చోట్ల హింసాత్మాక ఘటనలకు పాల్పడుతున్నారు..ఈ ఎన్నికలు ఒక పెద్ద కుంభకోణమని, పోస్టల్‌ బ్యాలట్లలో అక్రమాలు జరుగుతాయని పదే పదే చెప్పాడు..ప్రజాతీర్పును వమ్ము చేసే పక్షంలో సమ్మెకు దిగేందుకు సిద్దంగా ఉండాలని డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన కార్మిక సంఘాలు కూడా పిలుపునిచ్చాయి. అనేక చోట్ల ట్రంప్‌ మద్దతుదారులు అల్లర్లు,ఘర్షణలకు పాల్పడాలనే యత్నాల్లో కూడా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.. అందువలన ఫలితం తేలటం ఒకటైతే దాని పర్యసానాల గురించి యావత్‌ ప్రంచం ఎదురు చూస్తోంది. ఇలాంటి పరిస్ధితి గతంలో అమెరికాలో తలెత్తినట్లు లేదు.
ట్రంప్‌ గనుక ఓడిపోతే పలుచోట్ల హింసాకాండ తలెత్తే అవకాశం ఉందని పది రోజుల ముందు ఒక నివేదిక వెలువడింది..పలు రాష్ట్రాలలో మితవాద మిలిటెంట్‌, సాయుధ గ్రూప్‌లనుంచి ముప్పు ఎక్కువగా ఉందని హెచ్చరించింది..ఆ గ్రూప్‌లు ఇప్పటికే ఆందోళనలు, దాడులు ఎలా చేయాలో, ఎలా పోలీసులను తప్పించుకోవాలో శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తుంది..ఇప్పటికే చాలా బృందాలను గుర్తించినట్లు నివేదికను తయారు చేసిన సంస్ధలు పేర్కొన్నాయి..
ఇలాంటి శక్తులు అడ్డుకున్న కారణంగానే ఇటీవలె టెక్సాస్‌ రాష్ట్రంలోని ఆస్టిన్‌ నగరంలో డెమోక్రాట్‌ అభ్యర్ధి జోబిడెన్‌ ప్రచారం రద్దయింది..బిడెన్‌ ప్రయాణిస్తున్న బస్‌, ఇతర వాహనాలను సాయుధులైన వ్యక్తులు చుట్టుముట్టారు. మరోవైపు ట్రంప్‌ ప్రచార పతాకాలతో ఉన్న అనేక వాహనాలు కూడా చుట్టుముట్టాయి. పోలీసులు జోక్యంతో బిడెన్‌ ముందుకు సాగాల్సి వచ్చింది..బిడెన్‌ను అడ్డుకున్న వీడియోను ట్వీట్‌ చేస్తూ ఐ లవ్‌ టెక్సాస్‌ అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు.కరోనా వ్యాప్తి సమయంలో అమెరికాలో నల్ల జాతీయులపై వరుస దాడులు జరిగాయి..పోలీసులు నల్ల జాతీయులపట్ల వ్యవహరిస్తు తీరుపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి..ఇప్పుడు ట్రంప్ వ్యాఖ్యలతో చాలా రాష్ట్రాల్లో ట్రంప్ అభిమానులు భౌతిక దాడులు చేసే ప్రమాదం లేక పోలేదు..ఇప్పటికే జాతు మధ్య వైరుధ్యంలో అలాకుతలం అవున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో మరోసారి అల్లర్లు చేలరేగే అవకాశాలు కన్పిస్తున్నాయి.