చైనాపై మరోసారి మండిపడ్డ ట్రంప్..!

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చైనాపై మండిపడ్డారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఐరాస మంగళవారం పెట్టిన వర్చువల్‌ మీటింగ్‌లో ట్రంప్‌ సహా ఇతర ప్రపంచ దేశాధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ ని ప్రపంచం మీదకు వదిలిన డ్రాగన్‌ దేశం చైనా అని అన్నారు. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి చైనా దేశంపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రాణాలను హరించించుకుపోయే వైరస్ ని వ్యాపింపజేసినందుకు చైనా బాధ్యత వహించేలా చూడాలని ట్రంప్‌ కోరారు. అంతేకాదు కరోనాని మరోసారి చైనీస్‌ వైరస్ అంటూ సంబోధించారు.ఇక ప్రపంచం మీదకు ప్లేగును వదిలిన చైనాను జవాబుదారీగా చేయాలని ట్రంప్ అన్నారు.

trump
trump

కరోనా వైరస్ విషయంలో చైనా ప్రభుత్వంతో పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిర్లక్ష్యం వహించింది అన్నారు. అందువల్లనే వైరస్‌ వ్యాప్తి చెందిందని ట్రంప్ ఆరోపించారు. ఇక కరోనా నేపథ్యంలో డొమెస్టిక్‌ విమానాలను రద్దు చేసిందన్నారు. అంతేకాదు తమ పౌరులను ఇళ్లల్లో బంధించిన చైనా, ఆ దేశ అంతర్జాతీయ విమానాలపై తాను నిషేధం విధించడాన్ని మాత్రం తీవ్రంగా ఖండించిందని ఆయన అన్నారు. చైనా దేశం ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమని ట్రంప్‌ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news