ట్రంప్ పై 3500 కేసులు.. ఎందుకో తెలుసా..?

-

చైనా దేశం పై ప్రతీకారం తీర్చుకోవడం లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే చైనా దిగుమతులపై 300 బిలియన్ డాలర్ల సుంకాలను అమెరికా ప్రభుత్వం విధించింది. తద్వారా చైనా కు భారీ షాక్ ఇవ్వాలి అని అనుకుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కే షాక్ తగిలినట్లయింది. ఎందుకంటే ట్రంపు నిర్ణయాన్ని అమెరికా కంపెనీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి.

చైనా దిగుమతి వస్తువులపై భారీ ఎత్తున సుంకం విధించడంపై అమెరికా కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అడ్డు అదుపు లేకుండా వాణిజ్య యుద్ధానికి రెచ్చగొట్టేవిధంగా ట్రంప్ వైఖరి ఉంది అంటూ మండిపడుతున్నాయి ఆయా కంపెనీలు. వీటిలో బడాబడా కంపెనీలు కూడా ఉండటం గమనార్హం. కాగా ఇప్పటివరకు దాదాపు 3500 కంపెనీలు ట్రంప్ పై న్యాయ పోరాటం చేసేందుకు కేసులు నమోదు చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news