సంజయ్ రౌత్, దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య సమావేశం సంచలనం సృష్టించిన తరువాత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పష్టత ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య ‘రాజకీయ చర్చలు’ లేవని ఆదివారం స్పష్టం చేశారు. “సంజయ్ రౌత్ జీ నా ఇంటర్వ్యూను శివసేన వార్తాపత్రిక సామ్నా కోసం తీసుకోవాలనుకున్నారని చెప్పారు. కాని నేను కొన్ని షరతులు పెట్టాను అని అన్నారు.
వాటి గురించి చర్చించామని… ఆ ఇంటర్వ్యులో వాటిని తీసేయకుండా ప్రచురించాలి అని తాను కోరాను అని, రాజకీయ చర్చలకు స్థానం లేదని అన్నారు. “కొన్ని విషయాల గురించి చర్చించడానికి నేను నిన్న దేవేంద్ర ఫడ్నవిస్‌ను కలిశాను. ఆయన మాజీ సిఎం. అలాగే, ఆయన మహారాష్ట్రలో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పారు. తమ మధ్య చిన్న చిన్న విభేదాలు మినహా సిద్దాంతిక భేదాలు ఏమీ లేవని అన్నారు.