తన డెమొక్రాటిక్ ప్రత్యర్థి జో బిడెన్ చేతిలో నవంబర్ 3 ఎన్నికల్లో ఓడిపోతే తాను దేశం విడిచి వెళ్ళవలసి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చమత్కరించారు. శుక్రవారం రాత్రి జార్జియాలోని మాకాన్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ది హిల్ న్యూస్ వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది. మీకు అన్ని తెలుసు కాబట్టి నేను జోక్ చేయను… అధ్యక్ష ఎన్నికల్లో చెత్త అభ్యర్ధిపై పోటీ చేయడం నా మీద ఒత్తిడి తెస్తుందని ట్రంప్ అన్నారు.
నేను ఓడిపోతే రాజకీయ చరిత్రలో నేను చెత్త అభ్యర్ధి చేతిలో ఓడిపోయాను అనే బాధ నాకు ఉంటుంది అని అన్నారు. ఆ బాధ తట్టుకోలేక దేశం విడిచి వెళ్ళిపోతా ఏమో అని ఆయన అన్నారు.ఆ దేశంలో ఎన్నికలు నవంబర్ 3 న జరుగుతాయి. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ట్రంప్ వరుసగా ప్రచారం చేస్తున్నారు.