ట్రంప్ సంచలన నిర్ణయం…ఫేస్ బుక్ ట్విట్టర్ కు పోటీగా “ట్రూత్” యాప్..!

-

అమెరికా మాజీ అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా తానే ఒక సోషల్ మీడియా యాప్ ను ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. వచ్చేనెల తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ ను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా ట్విట్టర్ లో తాలిబన్ల హడావిడి ఎక్కువగా ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే అప్పట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లు ట్రంప్ ను నిషేధించిన సంగతి తెలిసిందే.

మొదట తాత్కాలికంగా ట్రంప్ పై నిషేదం విధించగా ఆ తర్వాత శాశ్వతంగా ట్రంప్ పై నిషేధం విధించాయి. ఇక వేరే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో పోస్ట్ లు చేసి నిషేధించబడే కంటే తానే ఒక సొంత ప్లాట్ ఫామ్ ఏర్పరుచుకోవాలని నిర్ణయం తీసుకున్నాడో… ఏమోగానీ మొత్తానికి ట్రూత్ ను లాంచ్ చేస్తున్నట్టు చెప్పాడు. అయితే ట్రంప్ కు అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మరి ఆయన ట్రూత్ ను ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news