చచ్చినట్టు మాస్క్ పెట్టుకున్న ట్రంప్…!

-

నన్ను పదే పదే విసిగించవద్దు, నేను మాస్క్ పెట్టుకుని మీడియాకు కనపడాల్సిన అవసరం నాకు లేదు. కావాలంటే మీరు పెట్టుకోండి గాని నేను మాత్రం పెట్టుకోలేను… టెక్సాస్ గవర్నర్ తో సరిగా రెండు నెలల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట ఇది. ఆయనకు వయసుతో పాటు చాదస్తం కూడా పెరిగింది అనే విషయం చాలా మంది అప్పుడు అన్నారు.

ఎన్ని విధాలుగా చెప్పిన సరే మాస్క్ మాత్రం ఆయన పెట్టుకునే ప్రయత్నం అనేది చేయలేదు. అయితే అక్కడ సినిమా మరోలా ఉంది. కరోనా దెబ్బకు ట్రంప్ లో భయం మొదలయింది. ఏ మీడియా కు అయితే నేను మాస్క్ పెట్టుకునేది లేదు, కనపడేది లేదని చెప్పారో అదే మీడియాకు ఆయన మాస్క్ తో కనిపించారు. సైనికులను చూడటానికి అధ్యక్షుడు ట్రంప్ ఆసుప‌త్రికి వచ్చారు. అక్కడ భయపడి ఆటోమేటిక్ గా ఆయన మాస్క్ ధరించారు.

Read more RELATED
Recommended to you

Latest news