ఫ్యాక్ట్ చెక్: ఆక్సిజన్ సిలెండర్ తో ఆసుపత్రి బయట కూర్చున్న మహిళా…. నిజమెంత..?

ఆక్సిజన్ సిలిండర్ తో హాస్పిటల్ బయట ఒక మహిళ కూర్చుంది. దీంతో ఆమె కి అందరూ సాయం చేయాలని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా లో ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ అయిపోయింది. అయితే దీనికి సంబంధించి పలు వివరాలు ఇప్పుడు చూద్దాం…! కరోనా వైరస్ కేసులు తీవ్రంగా వ్యాపిస్తున్నాయి. రోజు రోజుకీ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ సమయం లో ఫేక్ ఫోటోలు, మెసేజ్లు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి.

తాజాగా మసీదు నుంచి ముస్లింలు బయటికి వస్తున్న ఫోటో కూడా విపరీతంగా వైరల్ అయ్యింది. అదే తీరు లో ఇప్పుడు ఒక మహిళా హాస్పిటల్ బయట ఆక్సిజన్ సిలిండర్ తో కూర్చున్న ఫోటో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది.

ఫ్యాక్ట్ చెక్: ఈ ఫోటోకి సంబంధించి పూర్తిగా చూస్తే… ఈ ఫోటో లో ఎటువంటి నిజం లేదని అసలు ఇది కరోనా మహమ్మారి సమయంలోది కాదని తెలుస్తోంది. హాస్పిటల్ బయట ఆక్సిజన్ సిలిండర్ తో కూర్చున్న ఆ మహిళ ఫోటో ఉత్తరప్రదేశ్లో 2018 వ సంవత్సరం లోది అని తెలుస్తోంది. తన కొడుకు తనని అంబులెన్స్ లో ఉత్తరప్రదేశ్ ఆగ్రా మెడికల్ కాలేజ్ నుండి తీసుకెళ్తున్నప్పుడు తల్లి ఆక్సిజన్ సిలిండర్ లో వుంది. అప్పటి ఫోటో ఇది.

కానీ ఇప్పుడు కరోనా వైరస్ సమయంలోది ఇది అని పెట్టిన పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి. అందులో ఉండే అంబులెన్స్ చూపించకుండా కేవలం మహిళలని మాత్రమే చూపించి ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

ఆమెను ముందు ట్రామా సెంటర్ కి తీసుకెళ్ళి.. ఆ తర్వాత జనరల్ వార్డ్ లో జాయిన్ చేశారు అయితే ఆ వార్డు నుంచి మరో వాటికి వెళ్లడానికి దూరం ఎక్కువ ఉండడంతో ఆమె అంబులెన్స్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.

అదే సమయంలో తన కొడుకు ఆక్సిజన్ సిలిండర్ భుజం మీద పెట్టుకుని తన తల్లిని వార్డు షిఫ్ట్ చేయడం కోసం అక్కడ ఎదురు చూడడం జరిగింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ వార్డ్ లో తన తల్లిని అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ఇలా అప్పుడు జరిగిన ఈ సందర్భాన్ని ఇప్పుడు కరోనా నాటిదని ఫేక్ గా క్రియేట్ చేసారు.