కరోనా వల్ల చాలా మందిలో ఒత్తిడి పెరిగిపోయాయి. భయాలు పెరిగి ఒత్తిడిగా మారి చివరికి యాంగ్జాయిటీలోకి దారి తీస్తుంది. ప్రస్తుత జీవన విధానాల వస్తున్న ఈ మార్పులను తట్టుకోవడానికి మనం తీసుకునే ఆహారంలో మార్పులు తీసుకువస్తే బాగుంటుంది. అలాంటి మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం.
డి విటమిన్
డి విటమిన్ లోపం వల్ల యాంగ్జాయిటీ పెరిగే అవకాశం ఉంది. అమెరికాలో డి విటమిన్ లోపం ఉన్నవారు 77శాతం ఉన్నారని అంచనా. సూర్యుని నుండి వచ్చే ఈ విటమిన్ ఎముకలకి శక్తిని ఇచ్చి బలంగా మారుస్తుంది. అందుకే పొద్దున్న పూట ఎండలో తిరగాలని చెబుతుంటారు.
ఒమెగా 3
మెదడుని చురుగ్గా ఉంచడానికే కాకుండా జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచేందుకు ఒమెగా 3 కొవ్వులు బాగా పనిచేస్తాయి. ఈ కొవ్వులు ఎక్కువ శాతం చేపల్లోనే ఉంటాయి. అందుకే మీ ఆహారంలో చేపలని భాగం చేసుకోవడం మర్చిపోవద్దు.
పసుపు
పసుపులో ఉండే పదార్థాలు యాంగ్జాయిటీనే కాదు ఆల్జీమర్స్, పార్కిన్సన్ వంటి అనేక వ్యాధులను దూరం చేస్తాయి. ఇందులో యాంటీఇన్ ఫ్లేమేటరీ పదార్థాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
కృత్రిమ తీపికారకాలను వదిలేయాలి
మనం తీసుకునే ఆహారంలో చక్కెర శాతం పెరిగితే యాంగ్జాయిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే కృత్రిమ తీపికారకాలను బాగా తగ్గించాలి. అందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది.
గ్లూటెన్ ని తగ్గించాలి.
మానసికంగా ఆరోగ్యంగా ఉండి, శరీర జీవక్రియలు సరిగ్గా జరగాలంటే గ్లూటెన్ ని బాగా తగ్గించాలి.
పై వాటన్నింటనీ మీ డైట్ లో భాగం చేసుకుంటే యాంగ్జాయిటీ మీ నుండి పారిపోతుంది.