తెలంగాణా డిగ్రీ కాలేజీల్లో రెండు లక్షల సీట్లు ఖాళీ

(దోస్త్) డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ స్పెషల్ ఫేస్ కౌన్సెలింగ్ సీట్లు కేటాయింపు పూర్తయింది. స్పెషల్ ఫేస్ లో 21,437 సీట్లు కేటాయింపు జరిగింది. మొదటి మూడు ఫేజ్ ల్లో సీట్లు పొంది లక్షా 87 వేల 709 మంది విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. నవంబర్ 5 వరకు ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలని అంటున్నారు. డిగ్రీ కళాశాలల్లో భారీగా సీట్లు మిగిలి పోనున్నాయి.

రెండు లక్షల సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. దోస్త్ పరిధీలో ఉన్న డిగ్రీ కళాశాలలు 986 కాగా ఆ డిగ్రీ కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లు 4 లక్షల 9 వేల 456. మొదటి మూడు ఫేస్ ల్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన విద్యార్థులు లక్ష 87 వేల 709 కాగా స్పెషల్ ఫేజ్ లో సీట్లు పొందిన వారు 21 వేల 437 మంది ఉన్నారు. మొత్తం కలిపి 2 లక్షల 9 వేల సీట్లు ఫిల్ కాగా 2 లక్షల సీట్ల దాకా మిగిలి పోనున్నాయి.