బ్రేకింగ్ : తెలంగాణ ఇంటలిజెన్స్ ఛీఫ్ గా ప్రభాకర్ రావు

-

తెలంగాణ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎవరు రాబోతున్నారు అనే అంశం కొద్ది రోజులుగా ఆశక్తికరంగా మారింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నా నవీన్ చంద్ పదవీ కాలం నేటితో ముగుస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్తగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు ఇస్తుంది అనేది సస్పెన్స్ గా మారింది. నిజానికి గతంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ చీఫ్ ఎంకే సింగ్ పదవీ విరమణ చేసినా మళ్లీ ఆయనే తిరిగి తాత్కాలిక ఛీఫ్ గా ఎంపిక చేసింది.

ఈ విషయంలో కూడా అలానే జరుగుతుందని భావించినా చివరి నిమిషంలో ప్రభాకర్ రావుని ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎంపిక చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కి ఆయన ఐజీగా ఉన్నారు. ఆయన 1991లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా సర్వీస్ లో జాయిన్ అయ్యారు. అనంతరం పదేళ్ల సర్వీస్ తర్వాత ఐపీఎస్ గా ప్రమోట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news