Breaking : విద్యార్థులకు అలర్ట్‌.. ఎడ్‌సెట్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల

-

రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్ర‌వేశానికి నిర్వ‌హించిన‌ టీఎస్ ఎడ్‌సెట్‌-2022 ఫ‌లితాలు గత ఆగస్టులో విడుద‌లయ్యాయి. అయితే.. ఈ ఫలితాలను రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్. లింబాద్రి విడుద‌ల చేశారు. టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్ష జూలై 26న జరిగింది. ఈ పరీక్షకు 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 31,578 మంది హాజరయ్యారు. అయితే.. తాజాగా.. ఎడ్ సెట్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేసింది ఉన్నత విద్యా మండలి.

TS EDCET 2022: Schedule Released .. Apply – 2Telugustates

ఈ నెల 17 న నోటిఫికేషన్ కాగా.. 18 నుండి 26 వరకు దరఖాస్తులు స్వీకరచించనున్నట్లు ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. అయితే.. నవంబర్ 4న సీట్ల కేటాయించనున్నట్లు ఉన్నత విద్యా మండలి షెడ్యూల్‌లో పేర్కొంది. నవంబర్ 14 నుండి బీఈడీ తరగతులు ప్రారంభంకానున్నాయి. తెలంగాణలో మొత్తం 220 బీఈడీ కాలేజీల్లో 19,600 సీట్లు ఉన్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్ లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎడ్‌సెట్‌ రాసేందుకు అర్హులు.

 

Read more RELATED
Recommended to you

Latest news