ప్రైవేట్ ఆస్పత్రుల మీద పగబట్టారా…?

తెలంగాణాలో ప్రైవేట్ ఆస్పత్రుల విషయంలో ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అవుతుంది. అటు హైకోర్ట్ కూడా ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో 6 హాస్పిటల్స్ కు కోవిడ్ ట్రీట్మెంట్ ను హెల్త్ డైరెక్టరేట్ రద్దు చేసింది.

మొత్తం ఇప్పటి వరకు 22 హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్మెంట్ రద్దు చేసారు. నిన్నటి వరకు 16 కాగా ఇప్పుడు 6 ఆస్పత్రుల కరోనా లైసెన్స్ రద్దు చేసారు. కిమ్స్, సికింద్రాబాద్, సన్ షైన్ , గచ్చిబౌలి, సెంచరీ, బంజారాహిల్స్, లోటస్, లకిడికాపుల్, మెడిసిన్ .. ఎల్బీనగర్, ఇంటెగ్రో .. టోలిచౌక్ ఆస్పత్రులకు రద్దు చేసారు. ఇప్పటి వరకు 174 ఫిర్యాదులు 113 ఆస్పత్రుల పై వచ్చాయి.