చంద్రబాబు గారూ మీరైనా నా ప్రాణాలు కాపాడండి ప్లీజ్…!

కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఏపీలో విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక బ్లాక్ ఫంగస్ విషయంలో రాష్ట్ర ప్రభుతం సరిగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సంచలనం అయింది. చంద్రబాబూ… మీరైనా పట్టించుకోండి అంటూ ఒక యువకుడు వేడుకున్నాడు.

బ్లాక్ ఫంగస్ తో మా తాత చచ్చిపోతున్నా వైద్యులు పట్టించుకోలేదు అని బతిమలాడినా వైద్యం చేయక హేళన చేశారు అని ఆవేదన వ్యక్తం చేసాడు. టీడీపీ అధినేతకు ధర్మవరం యువకుడి కరణం శ్రీవాత్సవ కన్నీటి పర్యంతం అయ్యాడు. అంతకు ముందే బాధితుడి తండ్రి, అవ్వ కరోనా కాటుకు బలి అయ్యారని అమాచారం. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో దుర్భర పరిస్థితులు వున్నాయి… మీరైనా పట్టించుకోండి అని కోరాడు.