తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు తెలంగాణ గవర్నర్ తమిళి సై కు మధ్యన సత్సంబంధాలు లేవని తెలిసిందే. చాలా విషయాలలో వీరి మధ్యన సరైన అండర్స్టాండింగ్ లేక వివాదాలు అయ్యి.. అవి కాస్త కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లాయి. ఇక తాజాగా గవర్నర్ హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ ను సందర్శించడానికి వెళ్లారు. తమిళి సై హాస్పిటల్ లో అన్ని వార్డులలోనూ తిరుగుతూ అక్కడ రోగులకు ఏర్పాటు చేసిన సదుపాయాలను నిశితంగా పరిశీలించారు. కానీ ఈమె వార్డుల ఏర్పాటు మరియు అక్కడ ఉన్న సదుపాయాలపై, ముఖ్యంగా రోగులు వాడుతున్న టాయిలెట్ లపైన తీవ్ర ఆగ్రహం చెందారని తెలుస్తోంది. ఇంకా తదితర విషయాలపై సంతృప్తి చెందలేదన్న విషయం క్లారిటీగా అర్ధమవుతోంది. కొత్త బిల్డింగ్ ను నిర్మించడానికి వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేయలని సంబంధిత అధికారులను ఈమె ఆదేశించారు.
గవర్నర్ చేసిన కామెంట్ లపై ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఉస్మానియా హాస్పిటల్ అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.