ఎల్ఆర్ఎస్ పై షాక్ ఇచ్చిన హైకోర్ట్

తెలంగాణాలో ఎల్ ఆర్ ఎస్ వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసాయి. తాజాగా దీనికి సంబంధించి హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు నిర్ణయించే వరకు ఎల్ఆర్ఎస్ అమలుకు బలవంతపు చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. సుప్రీంకోర్టులో తేలే వరకు బీఆర్ఎస్ దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్ట్ స్పష్టం చేసింది.

అనధికార లేఅవుట్ లు, భవనాల క్రమబద్ధీకరణ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎల్ఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టులో ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదన్న రాష్ట్ర ప్రభుత్వ వివరణపై స్పందించిన కోర్ట్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున తాము విచారణ జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై దాఖలైన పిటిషన్లన్నింటిపై విచారణ ముగించింది.