పాలిసెట్ రాసిన విద్యార్థులుకు విద్యా శాఖ శుభవార్త చెప్పింది. తెలంగాణ పాలిసెట్ 2022 ఫలితాలను జూలై 13వ తేదీ (బుధవారం) ఉదయం 11.30లకు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక, శిక్షణ విద్యా మండలి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు https://polycetts.nic.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమో కోర్సుల్లో ప్రవేశానికి ఈ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS POLYCET Results)ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఈ సారి రెండు వేర్వేరు ర్యాంకులు జనరేట్ చేస్తారు. పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్ చేస్తారు. టెక్నికల్ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి ప్రవేశాలను కల్పిస్తారు.