ఒకరి తర్వాత ఒకరు విధుల్లోకి చేరుతున్న ఆర్టీసీ కార్మికులు..

-

నిన్న జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు వారు ఉద్యోగంలో చేరేందుకు సన్నద్దమౌతున్నారు. నవంబర్‌ 5 అర్ధరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు బేషరతుగా ఉద్యోగాల్లో చేరితే, వారి భవిష్యత్‌ బాగుపడుతుందనీ.. అడ్డగోలు యూనియన్ల నిర్ణయాల వల్ల తమ జీవితాల్ని, కుటుంబాల్ని నాశనం చేసుకోవద్దని సీఎం సూచించారు. దీంతో గత నెల రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగాల్లో చేరేందుకు డిపోల వద్దకు చేరుతున్నారు.

ప్రస్తుతానికి ఉప్పల్ డిపో అసిస్టెంట్ మేనేజర్ కె. కేశవ కృష్ణ డిపో మేనేజర్‌కు రిపోర్ట్ చేసి తాను విధుల్లో చేరినట్లు చెప్పారు. అదేవిధంగా, కండక్టర్ పి బాలా విశ్వేశ్వర్ రావు కూడా సిద్దిపేట డిపోలో విధుల్లో చేరారు. అంతే కాకుండా భద్రాచలం, ఉప్పల్‌, కామారెడ్డి, హయత్‌ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌ డిపోల వద్దకు కార్మికులు విధుల్లో చేరేందుకు సన్నద్దమై వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news