చాలా మంది హైదరాబాద్ ని ఇష్టపడుతూ వుంటారు. మీరు కూడా హైదరాబాద్ ని చూడాలని అనుకుంటున్నారా..? అయితే 12 గంటల్లో హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు చూసేయచ్చు. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) హైదరాబాద్ దర్శన్ అనే ఓ ప్యాకేజీను తీసుకు వచ్చింది.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఒక రోజులో హైదరాబాద్‌లోని ప్రదేశాలను చూడచ్చు. ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్ లో అయినా టికెట్స్ ని బుక్ చెయ్యచ్చు. దర్శన్ టూర్ ఉదయాన్నే స్టార్ట్ అవుతుంది. ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ లో ఇది స్టార్ట్ అవుతుంది.
తరవాత ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు బిర్లా మందిర్ చూడచ్చు.
10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చౌమహల్లా ప్యాలెస్
తారామతి బారాదరి రిసార్ట్‌లో హరిత హోటల్‌లో మధ్యాహ్నం 1 గంట నుంచి 1.45 గంటల వరకు లంచ్ ఉంటుంది.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు గోల్కొండ కోట చూడచ్చు.
4 గంటల నుంచి 5 గంటల వరకు దుర్గం చెరువు పార్క్, 5.30 గంటల నుంచి 6 గంటల వరకు కేబుల్ బ్రిడ్జి, 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ఎన్‌టీఆర్ పార్క్, హుస్సేన్ సాగర్ ని చూసేయచ్చు.
రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ ఆల్పా హోటల్‌కు రీచ్ అవుతారు.
www.tsrtconline.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో ఈ టూర్ వేయాలంటే పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130 చెల్లించాలి. అదే మెట్రో లగ్జరీ ఏసీ బస్సులో అయితే పెద్దలకు రూ.450, పిల్లలకు రూ.340 చెల్లించాలి. 040 23450033 లేదా 040 69440000 నెంబర్లకు సంప్రదించచ్చు.