ఆర్టీసీ సమ్మె: ఎట్టకేలకు చర్చలు షురూ.. ట్విస్ట్ ఏంటంటే..

-

తెలంగాణలో గత 22 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు తెరదించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జేఏసీ నేతలకు ఆర్టీసీ యాజమాన్యం లేఖలు రాసింది. శనివారం చర్చలకు రావాలని ఆహ్వానించింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని ఈఎన్సీ కార్యాలయంలో జేఏసీ నేతలతో సమావేశమైన ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరుపుతోంది. ఇక ట్విస్ట్ ఏంటంటే కేవ‌లం నలుగురు కార్మిక నేతలను మాత్రమే చర్చలకు అనుమతించారు. వారి ఫోన్లను అనుమతించబోమని అధికారులు చెప్పడంతో కార్మిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోన్లు సిచ్చాప్‌ చేసిన తర్వాతే చర్చలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

ఇక నలుగురు సభ్యులను మాత్రమే చర్చలకు అనుమతించడంతో జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి, జేఏసీ నేతలు శ్రీనివాసరావు, వాసు దేవరావు చర్చల్లో పాల్గొన్నారు. కార్మిక నేతలు సమావేశంలో అనుసరించే వ్యూహంపై ముందే ఆలోచించి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్ తో పాటు మరో 25 డిమాండ్లు నెరవేర్చాలని కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news