ఆర్టీసీ సమ్మెపై నేడు హైకోర్టులో విచారణ..

-

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొన‌సాగుతూనే ఉంది. అయితే ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. గత విచారణలో ప్రభుత్వ అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, పూర్తి వివరాలను మరోసారి కోర్టుకు తెలపాలని, కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీసీ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించినప్పటికీ.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆర్టీసీ సమ్మె వ్యవహారం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది.

మరోవైపు ప్రభుత్వ అధికారుల తీరును హైకోర్టు గత విచారణలో ఎండగట్టింది. ఆర్టీసీపై కేంద్ర ప్రభుత్వంకు ఉన్న అధికారాలు, రాష్ట్రాల్లో ఆర్టీసీపై కేంద్ర ప్రభుత్వంకు ఉన్న వాటా పై గత విచారణలో కేంద్ర ప్రభుత్వం తరపు సొలిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. టీఎస్ ఆర్టీసీకి చట్టబద్ధత లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కోర్టుకు ఎలాంటి వాదనలు వినిపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news