నిరుద్యోగులకు శుభవార్త.. TSSPDCLలో 1,601 ఉద్యోగాలకు ప్రకటన

-

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(TSSPDCL)లో 1601 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. డైరెక్ట్‌ ప్రాతిపదికన 1,553 జూనియర్‌ లైన్‌మెన్‌, 48 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు ఆ సంస్థ ప్రకటనను విడుదల చేసింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను ఈ నెల 15 లేదా ఆ తర్వాత తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. రాతపరీక్ష, నైపుణ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

గతేడాది మే నెలలోనే 1000 జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించినా.. కొందరు వ్యక్తులు ఈ పరీక్షలో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. అభ్యర్థుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని నియామమ ప్రక్రియను రద్దు చేశారు. తాజాగా, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలంటూ విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఆ సంస్థ ఛైర్మన్‌ రఘుమారెడ్డిని ఆదేశించిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది.

Read more RELATED
Recommended to you

Latest news