భ‌క్తుల‌కు శుభ‌వార్త‌.. జూన్ 8 నుంచి తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నం..?

-

క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యాన్ని గ‌త 80 రోజుల నుంచి మూసివేసిన సంగ‌తి తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ స్వామి వారికి నిత్యం జ‌ర‌గాల్సిన పూజ‌లు, అభిషేకాల‌ను పండితులు య‌థావిధిగా నిర్వ‌హిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ 5.0లో భాగంగా జూన్ 8 నుంచి ఆధ్యాత్మిక ప్ర‌దేశాలు, ప్రార్థ‌నా మందిరాల‌ను ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం అనుమ‌తులు ఇచ్చింది. దీంతో జూన్ 8 నుంచి తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యాన్ని భ‌క్తుల కోసం మ‌ళ్లీ తెర‌వ‌నున్న‌ట్లు తెలిసింది.

ttd plans to allow pilgrims for darshan from june 8th

అయితే శ్రీ‌వారి ఆల‌యంలోకి భ‌క్తుల‌ను మ‌ళ్లీ అనుమ‌తించాలంటే.. అందుకు ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి అనుమ‌తి రావాల్సి ఉంటుంది. అది రాగానే ద‌ర్శ‌నాల‌ను మ‌ళ్లీ ప్రారంభించాల‌ని ఆల‌య ధ‌ర్మ‌క్త‌ల మండ‌లి, ఉన్న‌తాధికారులు ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తున్నారు. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ.. భ‌క్తుడికి, భ‌క్తుడికి మ‌ధ్య క‌నీసం 1 మీట‌ర్ భౌతిక దూరం ఉండేలా.. నిత్యం ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌ను శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌నున్నార‌ని తెలిసింది. ఇక ఈ విష‌యంపై టీటీడీ త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న చేయ‌నున్నట్లు స‌మాచారం.

అయితే శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి భ‌క్తుల‌ను అనుమ‌తిస్తే.. భ‌క్తులు కొండ‌పై విశ్రాంతి తీసుకునేందుకు అద్దె గ‌దుల‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మ‌రి అందుకు టీటీడీ అనుమ‌తి ఇస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news